ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’లో ఛావా విలన్ అక్షయ్ ఖన్నా

Mahakali Movie Update

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కెరీర్‌ను కొత్త మెట్టుపైకి తీసుకెళ్తున్నారు. ‘హనుమాన్’ చిత్రంతో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, భారీ స్థాయిలో బాక్సాఫీస్ హిట్‌ను నమోదు చేశారు. ఈ విజయంతో ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) ప్రారంభమయ్యింది. మొత్తం 12 సూపర్ హీరో మూవీలను తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ వర్మ, తాజాగా మూడో చిత్రంగా ‘మహాకాళి’ మూవీని ప్రకటించారు.

ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ‘మహాకాళి’లో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా రీపోస్ట్ చేయడంతో, ఈ వార్తకు అధికారికంగా సిగ్నల్ పడినట్లయింది. ఇటీవలే విడుదలైన ‘ఛావా’ మూవీలో ఔరంగజేబ్ పాత్రలో అద్భుతంగా నటించిన అక్షయ్ ఖన్నా, ఇప్పుడు PVCUలో కూడా తనదైన ముద్ర వేయనున్నారు.

‘మహాకాళి’ సినిమాను బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మహిళా సూపర్ హీరో కథగా రూపొందుతుండగా, దానికి ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సృష్టించిందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Read More