పవన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాల్లోకి రేణు దేశాయ్ వస్తున్నారా?

Renu Desai comments on politics and Akira entry

ప్రముఖ నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె తన రాజకీయ ప్రస్థానం, తన కుమారుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తాను, దానిని రహస్యంగా ఉంచను,” అంటూ స్పష్టంగా తెలిపారు. గతంలో రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఉన్నా, పిల్లల భవిష్యత్ కోసమే ఆ అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు. “ప్రజల సేవ చేయడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ రాజకీయాలు నాకు సరిపోవు అనే భావన కలిగింది,” అని రేణు వ్యాఖ్యానించారు.

ఇక అకీరా నందన్ సినీ రంగ ప్రవేశం గురించి వస్తున్న ప్రచారాలపై కూడా రేణు క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో అకీరా కనిపించనున్నాడని ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, “అవి అన్నీ రూమర్లు మాత్రమే. అకీరా సినిమాల్లోకి వస్తే, స్వయంగా నేనే ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేస్తాను,” అంటూ రేణు తేల్చి చెప్పారు. “ఆ రూమర్లు ఆపేయండి” అని కోరారు. తన కుమారుడిని బిగ్ స్క్రీన్‌పై చూడాలన్న తపన తల్లిగా తనకు ఎంత ఉందో కూడా ఆమె స్పష్టం చేశారు.

సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినా, అకీరా మీద ఎలాంటి ఒత్తిడీ పెట్టే ప్రసక్తే లేదని రేణు దేశాయ్ అన్నారు. “అతనికి ఏది ఇష్టం ఉంటే అదే చేయమని చెబుతాను,” అంటూ తన దృక్పథాన్ని వివరించారు. ఈ వ్యాఖ్యలతో అకీరా ఓజీ సినిమాలో నటిస్తున్నాడన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడినట్టే చెప్పాలి. రేణు దేశాయ్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read More