తెలంగాణలో మూడు స్టేషన్లకు ప్రత్యేక శ్రద్ధ : Kishan Reddy

kishan reddy

హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ రైల్వే అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతోంది. దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. 2026 నాటికి మరో 40 స్టేషన్ల అభివృద్ధిని పూర్తి చేస్తాం,” అని తెలిపారు.

బేగంపేట స్టేషన్‌ను మహిళా సిబ్బందితో నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో రూ.80,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులపై ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. ఈ దసరా సందర్భంగా కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

ప్రధాని మోదీ ఇటీవల ఎంఎంటీఎస్ రెండో దశను ప్రారంభించారని, త్వరలో యాదగిరిగుట్టకు కూడా ఎంఎంటీఎస్ రైలు సేవలు ప్రారంభించనున్నట్లు వివరించారు.

ఈ సందర్భంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ట్విట్టర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉన్నా, తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలపై మాత్రం ఒక్క మాటా మాట్లాడటం లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు మోదీ వచ్చినప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ హాజరుకావడంలేదు,” అంటూ విమర్శించారు.

తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పటికే ప్రారంభించామని, అక్కడికి రహదారి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ వేగంగా పూర్తి చేస్తే, కేంద్రం కూడా నిధులను త్వరితగతిన మంజూరు చేస్తుందని వెల్లడించారు.

తెలంగాణలో మరిన్ని విప్లవాత్మక రైల్వే ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

Read More : సీఎం పై కేటీఆర్ మండిపాటు.

One thought on “తెలంగాణలో మూడు స్టేషన్లకు ప్రత్యేక శ్రద్ధ : Kishan Reddy

Comments are closed.