తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన సీనియర్ నటి వాసుకి (పాకీజా) ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆమె పరిస్థితిపై సమాచారం తెలిసిన వెంటనే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆమెకు తక్షణ సాయంగా రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ రోజు అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తరపున ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వాసుకికి చెక్కును అందజేశారు. ఇటీవల వాసుకి తన అనారోగ్య, ఆర్థిక సమస్యలను వివరిస్తూ విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటి ఆధారంగా పవన్ కల్యాణ్ స్పందించి వెంటనే సాయం అందించారు.
ఈ సందర్భంగా నటి వాసుకి భావోద్వేగానికి లోనయ్యారు. “పవన్ కల్యాణ్ వంటి మహానుభావుడు నాకు అండగా నిలవడం ఊహించలేని విషయం. ఆయన కాళ్లు మొక్కాలనిపిస్తోంది. జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ కన్నీటి కలకలతో స్పందించారు.
1990వ దశకంలో ‘అసెంబ్లీ రౌడీ’ వంటి చిత్రాల్లో నటించిన వాసుకి, ‘పాకీజా’ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు గుర్తింపు పొందారు. అనంతరం అవకాశాలు తగ్గడంతో ఆమె అనారోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా కష్టాల్లో పడ్డారు. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ చేసిన ఈ మానవతా సహాయం సర్వత్రా ప్రశంసలు పొందుతోంది.
Read More : జూలై 10న ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

One thought on “పవన్ కల్యాణ్ చేతుల మీదుగా వాసుకికి ఆర్థిక సహాయం”
Comments are closed.