“జైలు సీఎం” సెంటిమెంట్ ఫెయిల్ – ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు భారీ ఎదురుదెబ్బ!

జైలు సీఎం సెంటిమెంట్ ఫెయిల్ – కేజ్రీవాల్‌ కు Delhi ఎన్నికల్లో ఎదురుదెబ్బ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) భారీ విజయం సాధించింది. మొత్తం 70 స్థానాల్లో 48 సీట్లు గెలుచుకుని, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. వరుసగా రెండు సార్లు గెలిచిన AAP ఈసారి ప్రధాని మోదీ (Narendra Modi) ప్రభంజనానికి తట్టుకోలేకపోయింది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ దేశ రాజధానిలో అధికారం చేపట్టనుంది.

అయితే, కేజ్రీవాల్‌కు Jail CM సెంటిమెంట్ ఏమాత్రం కలిసిరాలేదు. గతంలో జైలుకు వెళ్లిన రాజకీయ నేతలు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కానీ కేజ్రీవాల్ మాత్రం ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేశారు.

Other leaders who became CMs from prison

YS Jagan: 2019కి ముందు అవినీతి కేసుల్లో వైసీపీ (YCP) అధినేత జగన్ 10 నెలలపాటు జైలులో ఉన్నారు. విడుదలైన తర్వాత 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని ఏపీ సీఎం అయ్యారు.

Chandrababu Naidu: 2024 ఎన్నికల ముందు అక్రమ కేసులపై చంద్రబాబు 2 నెలలపాటు జైల్లో ఉన్నారు. విడుదలైన తర్వాత టీడీపీ , BJP, Janasena కూటమితో కలిసి 164 సీట్లు గెలిచి వైసీపీని ఓడించారు.

రేవంత్ రెడ్డి : 2015లో క్యాష్ ఫర్ ఓట్ (Cash for Vote) కేసులో రేవంత్ జైలుకు వెళ్లారు. తర్వాత కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరి, 2023 Telangana ఎన్నికల్లో సీఎం అయ్యారు.

హేమంత్ సోరెన్ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Jharkhand CM Hemant Soren) భూ కుంభకోణం (Land Scam) కేసులో జైలు వెళ్లి, 2024 ఎన్నికల్లో తిరిగి గెలిచి సీఎం అయ్యారు.

కేజ్రీవాల్‌కు ఎందుకు బ్రేక్?

కేజ్రీవాల్‌ను 2024లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate – ED) అరెస్టు చేసింది. 6 నెలల జైలు అనంతరం ఆయన విడుదలై ఎన్నికల్లో పోటీచేసినా ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో Jail CM సెంటిమెంట్‌కు బ్రేక్ పడిందని చెప్పొచ్చు.

Also read this news: