సింగపూర్‌లోని ఓ పాఠశాలలో ఇటీవల చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు.
ఈ ఘటనపై ట్వీట్ చేసిన ఆయన, “ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన వార్త తీవ్రంగా కలచివేసింది. చిన్నారి త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో పవన్ కల్యాణ్ కుటుంబానికి నా పూర్తిస్థాయి సానుభూతి వ్యక్తం చేస్తున్నాను” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించి ప్రార్థనలు తెలియజేశారు.
Read More : బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలకు వరంగల్ వేదిక.. భారీ ఎత్తున ఏర్పాట్లు..
