ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఓ సంచలన ట్వీట్ చేశారు. ఆయన ప్రధాని మోదీని “అనికేత్” అని అభివర్ణించారు. “అనికేత్” అంటే “ఇల్లు లేకుండా” అని అర్థమవుతుందని పవన్ తెలిపారు. తన సన్యాసి జీవితంలో, గౌరవనీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని “అనికేత్” అని పిలిచేవారని పవన్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఈ మేరకు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్వీట్‌లో, “అనికేత్” అనే పేరు శివుడికి కూడా ఉందని, సృష్టి యొక్క శాశ్వత సన్యాసిగా ఉన్న ఆయనకు స్వంత ఇల్లు లేదని చెప్పారు. “ఇందు వరకూ, ‘అనికేత్’ అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి, కామాఖ్య నుండి ద్వారక వరకు భారత్‌ను తనదిగా భావించేవాడే. నిరాశ్రయుడైనప్పటికీ, ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద పేదలకు కోట్లాది ఇళ్లను అందించాడు” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
Read More : భారత సైన్యానికి అండగా నిలిచిన లోకేశ్ పై ప్రశంసలు
