తమిళనాడులో BJP కూటమిపై పవన్ ట్వీట్ వైరల్ — 2018 జనసేన పాత వ్యాఖ్యను గుర్తు చేసిన వైఎస్సార్సీపీ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ట్విట్టర్‌లో చేసిన ఓ వ్యాఖ్య ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో AIADMK – BJP కూటమి ప్రస్థానం రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేయగా… ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే పవన్ కల్యాణ్ చేసిన ఈ తాజా ప్రకటనను ప్రస్తావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 2018లో జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతా నుంచి చేయబడిన ఓ పాత ట్వీట్‌ను తెరపైకి తెచ్చారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల జాతీయ పార్టీలు చూపుతున్న అన్యాయంపై అప్పట్లో జనసేన పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. “జాతీయ పార్టీలు దక్షిణాదిపై వివక్ష చూపుతున్నాయి” అంటూ 2018లో జనసేన చేసిన ఈ ట్వీట్‌ను ఇప్పుడు వైఎస్సార్సీపీ శ్రేణులు సోష‌ల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ పవన్ కల్యాణ్ వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఒకపక్క జాతీయ పార్టీలను దక్షిణాది పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ విమర్శించిన జనసేన, ఇప్పుడు AIADMK – BJP కూటమి అభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రశంసించడంలో దొర్లిన వ్యత్యాసాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు pointed out చేస్తూ పవన్ రాజకీయ వైఖరిని ప్రశ్నిస్తున్నారు.

Read More : “పవన్ కళ్యాణ్ తాజా చర్యలపై సీపీఐ రామకృష్ణ ప్రశ్నలు”