ఫ్రీ స్ట్రీమింగ్‌తో మళ్లీ హైప్ క్రియేట్ చేసిన ‘ఎనీ వన్ బట్ యు’!

Any One But You movie

2023లో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఎనీ వన్ బట్ యు’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1900 కోట్ల వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఏడాదిన్నర పాటు థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికలపై మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గతంలో అమెజాన్, జీ5, నెట్‌ఫ్లిక్స్‌లలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా, ఇప్పుడు సోనీ లివ్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుండటంతో మళ్లీ వార్తల్లో నిలిచింది.

సాధారణంగా సినిమాలు ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ ‘ఎనీ వన్ బట్ యు’ మాత్రం మల్టిపుల్ ప్లాట్‌ఫాంలలో స్ట్రీమింగ్ అవుతూ ప్రత్యేకత సంతరించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఒప్పందం ముగియడంతో అక్కడ నుంచి తొలగించగా, వెంటనే సోనీ లివ్‌లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. దీంతో సినిమా అభిమానులు భారీగా సోనీ లివ్‌కు వచ్చి స్ట్రీమింగ్ చేస్తున్నారు. విడుదలైన ఏడాదిన్నర తర్వాత ఓ సినిమాకు ఇంత స్పందన రావడం పరిశ్రమలోనే అరుదైన విషయం అంటున్నారు విశ్లేషకులు.

అపుడే కాకుండా, ఈ సినిమాకు ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా రెంటల్ ద్వారా కూడా భారీ ఆదాయం వచ్చినట్టు సమాచారం. నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫాంలలో రెంటల్ మోడల్ ద్వారా రూ.100 కోట్లకు పైగా సంపాదించినట్టు టాక్ ఉంది. సోనీ పిక్చర్స్ వారు ఉచితంగా స్ట్రీమింగ్ ప్రారంభించిన తర్వాత ‘ఎనీ వన్ బట్ యు’కి మరింతగా గ్లోబల్ రెస్పాన్స్ పెరిగింది.

సిడ్నీ స్వీనీ, గ్లెన్ పావెల్ జంటగా నటించిన ఈ సినిమాను విల్ గ్లక్ దర్శకత్వం వహించాడు. డేటింగ్‌కు వెళ్లి విడిపోయిన జంట ఒక పెళ్లి వేడుకలో మళ్లీ కలసిన తర్వాత చోటుచేసుకున్న సంఘటనల చుట్టూ కథ సాగుతుంది. కామెడీ, రొమాన్స్ మేళవించిన స్క్రీన్‌ప్లే యువతను బాగా ఆకట్టుకుంది. 2023 డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికీ తన క్రేజ్‌ను కొనసాగిస్తూ ఉన్న విశేషం.

Read More


One thought on “ఫ్రీ స్ట్రీమింగ్‌తో మళ్లీ హైప్ క్రియేట్ చేసిన ‘ఎనీ వన్ బట్ యు’!

Comments are closed.