పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తైంది. ఎన్నో అడ్డంకులు ఎదురైనా, చివరకు అభిమానుల ఎదురుచూపులకు తెరదించింది ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా. ఎ.ఎం. రత్నం నిర్మాణంలో, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కింది.
రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, చివరి షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి చిత్రీకరణ పూర్తి చేశారు. షూటింగ్ చివర్లో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించగా, అవే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
షూటింగ్ పూర్తైన విషయం తెలియడంతో అభిమానుల్లో హుషారు నెలకొంది. మేకర్స్ త్వరలో ట్రైలర్‌తో పాటు భారీ పాటల ప్యాకేజ్ విడుదల చేయనున్నారు. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం, విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచబోతున్నాయి.
17వ శతాబ్దం నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ యోధుడిగా చేసే పాత్ర, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉంది.
One thought on “వీరమల్లు సెట్‌కు గుడ్‌బై.. రిలీజ్‌కు కౌంట్‌డౌన్”
Comments are closed.