తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఘోర రసాయన కర్మాగార పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తక్షణంగా రూ.1 లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు.
ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, బాధితులకు అవసరమైన వైద్య సహాయం వెంటనే అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయిలో బాధితులకు అండగా ఉండామని, వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని రేవంత్ రెడ్డి కోరారు.
ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు సంబంధిత శాఖలకు ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు.
Read More : సిగాచీ కెమికల్ పరిశ్రమలో : మృతుల సంఖ్య 42కి చేరిక

One thought on “పాశమైలారం పేలుడు: సీఎం సాయం”
Comments are closed.