అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి బాలకృష్ణ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి టీడీపీ ఎమ్మెల్యే, ట్రస్ట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. ఈరోజు భూమి పూజ నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు నారా బ్రహ్మాణి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

నేలపాడు–అనంతవరం ఈ-7 రహదారికి ఆనుకుని 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. మూడు దశల్లో నిర్మాణం పూర్తవుతుంది. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత ఆంకాలజీ సేవలు అందించనున్నారు. రూ.750 కోట్ల వ్యయంతో ఆధునిక మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో పడకల సంఖ్యను 1,000కి పెంచే ప్రణాళిక ఉంది.

మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్ణయించారు. ఈ ఆసుపత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా రోగులకు అధునాతన క్యాన్సర్ చికిత్స అందే అవకాశం ఉంది.

One thought on “అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి బాలకృష్ణ శ్రీకారం

Comments are closed.