USA: విదేశీయులపై అమెరికా కొత్త హెచ్చరికలు, 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి

usa-foreign-nationals-registration-mandatory

అమెరికాలో విదేశీ జాతీయులపై కఠిన ఆంక్షలు విధించడానికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ చర్యలు తీసుకుంది. 30 రోజులకు మించి అమెరికాలో ఉంటే, ఫెడరల్‌ గవర్నమెంట్‌ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, జరిమానాతో పాటు జైలు శిక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. 30 రోజుల కాలాన్ని మించితే, ఒక రోజు ఎక్కువగా ఉన్నప్పుడే $998 జరిమానా, లేదా వెయ్యి నుండి ఐదు వేల డాలర్ల వరకు జరిమానా విధించబడుతుంది.

ఈ నిబంధనలు హెచ్‌1బీ, విద్యార్థి పర్మిట్‌ వీసాలపై ఉన్నవారికి వర్తించవు. కానీ, సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండే విదేశీయులపై ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయబడతాయి. హెచ్‌1బీ వీసా లేదా విద్యార్థి వీసా కలిగి ఉన్నవారు తమ వీసా నిబంధనలను పక్కాగా పాటించకపోతే, వారు తమ వీసా కోల్పోవచ్చు.

అక్రమ ఇమిగ్రెంట్లను గుర్తించేందుకు, రిజిస్ట్రేషన్, ఫింగర్‌ప్రింటింగ్, చిరునామా మార్పుల కోసం కొత్త నిబంధనలు అమలు చేస్తున్న అమెరికా, 14 ఏళ్ల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన విదేశీయులు 30 రోజులకు మించి ఉంటే తప్పనిసరిగా రిజిస్టర్‌ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. లేకపోతే, 5 వేల డాలర్ల వరకు జరిమానా లేదా 30 రోజుల జైలు శిక్షను విధించే అవకాశం ఉంది.

ప్రస్తుతం, అమెరికాలో సుమారు 10-12 లక్షల అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు, వీరిలో మన దేశం నుంచి సుమారు 3-4 లక్షల మంది ఉంటారని అంచనా. ఈ కొత్త నిబంధనలు ఈ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read More


One thought on “USA: విదేశీయులపై అమెరికా కొత్త హెచ్చరికలు, 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Comments are closed.