పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని మద్దతు ఇస్తోందని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి యునైటెడ్ కింగ్‌డమ్‌లో స్పష్టం చేశారు. భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారతదేశం తీసుకున్న చర్యలకు సంబంధించి, పాక్ సైన్యం ఉగ్రవాదుల శవాలపై అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించిందని ఆయన చెప్పారు. ఆయన ప్రదర్శించిన ఫోటోలో అమెరికా నిషేధిత ఉగ్రవాది మసూద్ అజార్ సోదరుడు హఫీజ్ అబ్దుర్ రవూఫ్ పాక్ సైనికాధికారులతో కలిసి ఉన్నారని, ఆ ఫోటోలో శవపేటికలపై పాకిస్థాన్ జాతీయ పతాకాలు కప్పబడి ఉన్నాయని చెప్పారు.

“ఈ ఫోటో చూడండి, ఇందులో హఫీజ్ అబ్దుర్ రవూఫ్, అమెరికా నిషేధిత ఉగ్రవాది. అతని వెనుక ఉన్నది పాకిస్థాన్ సైన్యం, శవపేటికలపై పాకిస్థాన్ జాతీయ జెండాలు ఉన్నాయి. ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంటే, మీరు ఎలాంటి వ్యవస్థను ఆశించగలరు?” అని దొరైస్వామి ప్రశ్నించారు.

పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని భారత్ ఎన్నో దశాబ్దాలుగా ఆరోపిస్తుంటే, ఈ ఫోటో దానికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన అన్నారు.

Read More : పాక్ వైమానిక దళం దాడి, భారత రక్షణ దళాలు సమర్థంగా ప్రతిస్పందన.