పంజాబ్‌లో భారీ ఉగ్రదాడిని అడ్డుకున్న పాకిస్థాన్ పోలీసు దళాలు

PAKISTANI POLICE FOILED

నిషేధిత టీటీపీ గ్రూప్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు అరెస్ట్

పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో భారీ ఉగ్రదాడిని పాక్ పోలీసులు సమర్థంగా అడ్డుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) గ్రూప్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ దాడి నిరోధానికి సంబంధించి పంజాబ్ రాష్ట్ర కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (CTD) ప్రత్యేకంగా 73 ఆపరేషన్లు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, నిషేధిత సాహిత్యం, ఇతర సంశయాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

CTD అధికారుల ప్రకారం, అరెస్టయిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో ప్రధాన భవనాలను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో దాడికి సిద్దమయ్యారు. లాహోర్ సహా ఇతర కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులకు తెరలేపాలని కుట్ర పన్నారు. అయితే, భద్రతా బలగాలు సమయానికి సమాచారం సేకరించి, చాకచక్యంగా ఈ కుట్రను భగ్నం చేశాయి. అధికార వర్గాల ప్రకారం, అరెస్టయిన ఉగ్రవాదుల నుంచి ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) సహా భారీ స్థాయిలో విస్ఫోటకాలను స్వాధీనం చేసుకున్నారు.

కౌంటర్ టెర్రరిజం విభాగం చేపట్టిన ఈ ఆపరేషన్ పంజాబ్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో కీలక ముందడుగుగా పేర్కొనబడుతోంది. అధికారులు ఈ ఘటనపై మరింత లోతైన విచారణ చేపడుతున్నారని, ఉగ్రదాడులకు సంబంధించి మరింత సమాచారం త్వరలో వెల్లడించనున్నట్లు వెల్లడించారు.

Read More

One thought on “పంజాబ్‌లో భారీ ఉగ్రదాడిని అడ్డుకున్న పాకిస్థాన్ పోలీసు దళాలు

Comments are closed.