ఇజ్రాయెల్ ఎలాంటి సైనిక చర్యకు దిగితే తమ భద్రతా ప్రయోజనాల కోసం వెంటనే కౌంటర్ చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి (SNSC) సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్‌లోని రహస్య అణు కేంద్రాలు సహా కీలక ప్రదేశాలపై తమకు స్పష్టమైన నిఘా సమాచారం అందిందని పేర్కొంది.
ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ఇటీవల వెల్లడించిన ప్రకారం, ఇజ్రాయెల్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని తమ నిఘా వర్గాలు సేకరించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ ఎస్‌ఎన్‌ఎస్‌సీ ఈ హెచ్చరికను జారీ చేయడం గమనార్హం.
ఇజ్రాయెల్ నుంచి తమపై ఎలాంటి సైనిక దాడి జరిగినా… నిఘా ఆధారంగా గుర్తించిన అణు కేంద్రాలను తక్షణమే లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇది తమ వ్యూహాత్మక ప్రతిస్పందనలో భాగమని, శత్రు దేశాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, నిరోధక శక్తిని బలోపేతం చేయడమే లక్ష్యంగా తాము వ్యవహరిస్తున్నామని పేర్కొంది.
ఇరాన్ ఆర్థిక, సైనిక ఆస్తులపై జరిగే దాడులకు తగిన ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడ వివరించింది. కాగా, ఇజ్రాయెల్ అణ్వాయుధ సామర్థ్యంపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఆ దేశం తామొక అణు శక్తిగా ఉన్నారనే విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు, తిరస్కరించలేదు కూడా.
Read More : డ్రోన్ల, క్షిపణుల మోతతో మళ్లీ ఉద్రిక్తత

One thought on “ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధంగా ఉన్నామంటున్న ఇరాన్.”
Comments are closed.