ఈ నెల 24వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఈ క్షిపణి పరీక్ష జరగనుందని ఏఎన్ఐ నివేదిక తెలిపింది. కరాచీ తీరానికి సమీపంలో ఉన్న ప్రత్యేక ఆర్థిక మండలిలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష జరుగుతున్న రోజుల్లో ఆ ప్రాంతం ప్రమాదకరమై ఉంటుందని, ఆ దిశగా విమానాలు లేదా నౌకలు వెళ్లవద్దని పాకిస్థాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ ఆగ్రహంతో పాక్‌పై కఠినమైన దౌత్యపరమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు బాధ్యత వహించాల్సిందిగా భారత్ దౌత్య ఒత్తిడిని పెంచింది.
ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రకటించిన క్షిపణి పరీక్ష అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించి భారత భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మరియు సరిహద్దుల్లో భద్రతను మరింత కఠినంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
ఈ పరీక్ష వెనుక ఉద్దేశ్యాలు ఏమిటనే కోణంలోనూ నిఘా సంస్థలు విశ్లేషణ జరుపుతున్నాయి.
Read More : పహల్గామ్ ఉగ్రదాడికి మాకు సంబంధం లేదని క్లారిఫికేషన్
