చియాన్ విక్రమ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ వీర ధీర శూర ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ఈ సినిమా తెలుగులో ‘వీర ధీర శూర’ పేరుతో మార్చి 27న విడుదలైంది. ఎస్యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, ఎస్జే సూర్యల నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తమిళంలో భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి మాస్ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు పాత్రల తీవ్రతను బాగా హైలైట్ చేసిన ఈ చిత్రం, థియేటర్లో మెప్పించిన ప్రేక్షకుల్ని ఇప్పుడు ఓటీటీ ద్వారా చేరుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలై నెలరోజులకే ఓటీటీలోకి రావడం విశేషం. మూవీని మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే కంఫర్ట్‌గా ఆస్వాదించవచ్చు.
హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్గా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. మరి ముఖ్యంగా విక్రమ్, ఎస్ జే సూర్యల పర్ఫార్మెన్స్ కోసమైనా ఈ చిత్రాన్ని ఓటీటీలో తప్పక చూడాల్సిందే.

One thought on “తమిళంలో హిట్, ఇప్పుడు ఓటీటీలో టాక్ ఆఫ్ ది టౌన్!”
Comments are closed.