ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలుపై అమెరికాతో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ బల్వంత్ బస్వంత్ వాంఖడే అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలో ఎఫ్-35 వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలపై చర్చించే అవకాశాన్ని ప్రస్తావించినప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి సంభాషణలు జరగలేదని మంత్రి స్పష్టం చేశారు.
అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్నత స్థాయి సమావేశాల్లో ఎఫ్-35 విమానాల విక్రయంపై అధికారిక ప్రతిపాదన ఏదీ రాలేదని తెలిపారు.
మరోవైపు, అమెరికా భారత ఎగుమతులపై 25 శాతం సుంకం విధించిన నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యలు చేపట్టే యోచనలో లేదని, బదులుగా అమెరికా నుంచి సహజ వాయువు, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం దిగుమతులను పెంచే దిశగా ఆలోచిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదికలో వెల్లడైంది. అలాగే, ఎఫ్-35 యుద్ధ విమానాలతో సహా కొత్త రక్షణ కొనుగోళ్లు ప్రస్తుతం పరిశీలనలో లేవని కూడా స్పష్టంచేశారు.
Read More : ట్రంప్‌కి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ అమెరికా డిమాండ్

One thought on “ఎఫ్-35 యుద్ధ విమానాలపై అమెరికాతో చర్చలేదన్న కేంద్రం”
Comments are closed.