జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. విదేశాల్లో కూడా భారత సంతతి ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం వద్ద భారత సంతతి వ్యక్తులు శాంతియుతంగా నిరసన తెలిపారు.
అయితే, నిరసనకారులపై పాకిస్థాన్ డిఫెన్స్ అటాషె తైమూర్ రహత్ దురుసుగా ప్రవర్తించాడు. వారిని చూస్తూ గొంతు కోస్తున్నట్లు చేతులతో తీవ్ర సైగలు చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దృశ్యాలు కెమెరాల్లో నమోదై, ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
గతంలోనూ తైమూర్ రహత్ వివాదాస్పద ప్రవర్తనకు పాల్పడినట్లు రికార్డులు ఉన్నాయి. 2019లో భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను అవమానించేలా ఓ పోస్టర్ ప్రదర్శించిన ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.
ప్రస్తుతం జరిగిన ఘటనపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దౌత్యవేత్త స్థాయికి తగని ప్రవర్తన చేసిన తైమూర్ రహత్‌ను తక్షణమే వెనక్కి పిలిపించాలని డిమాండ్లు గుప్పిస్తున్నారు. ఆయన చర్యలు ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు పలువురు విశ్లేషిస్తున్నారు.
ఈ ఘటన పాక్ రాయబారి తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తించేందుకు దారితీస్తోంది.

One thought on “లండన్‌లో పాక్ రాయబారి దురుసు ప్రవర్తన”
Comments are closed.