చిన్నారి హత్య, తల్లిపై నలుగురు దుండగుల అత్యాచారం

హరియాణా రాష్ట్రంలోని జీంద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నలుగురు దుండగులు ఓ గుడిసెలోకి చొరబడి అమానుషానికి పాల్పడ్డారు. ఐదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్తకుప్ప వద్దకు తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేశారు. అదే సమయంలో చిన్నారి తల్లిపై నలుగురు కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు.

గురువారం బాధిత మహిళ స్పృహలోకి వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Read More : బస్సులో యువతిపై లైంగిక వేధింపులు