పాకిస్థాన్ మరో కీలక సైనిక చర్య చేపట్టింది. తన surface-to-surface పైకి ప్రయోగించగల “అబ్దాలీ” క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్షిపణి 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని పాక్ సైన్యం తెలిపింది.
పాకిస్థాన్ సైన్యం చేపట్టిన “ఇండస్” విన్యాసాలు భాగంగా ఈ “అబ్దాలీ” క్షిపణి ప్రయోగం నిర్వహించబడింది. ఈ పరీక్షలో క్షిపణి వ్యవస్థల సామర్థ్యాన్ని, ముఖ్యంగా నావిగేషన్ వ్యవస్థను ధృవీకరించడం ప్రధాన ఉద్దేశంగా చెప్పింది. పాకిస్థాన్ సైన్యం ఈ ప్రయోగం ద్వారా తమ సైనిక దళాల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించుకోవడమే లక్ష్యంగా ఉందని పేర్కొంది.
ఇటీవల పాకిస్థాన్ తరచూ క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ, పాకిస్తాన్-భారత్ మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నట్లు భారత రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ ఇటీవలే ఏప్రిల్ 24-25, 26-27 తేదీలలో కరాచీ తీరంలోని ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో క్షిపణి ప్రయోగాలు నిర్వహించనుందని ప్రకటించింది. ప్రస్తుతం, ఏప్రిల్ 30 నుంచి మే 2 మధ్య మరొకసారి ప్రయోగాలు చేపడుతున్నట్లు పాక్ ప్రకటించింది.
Read More : భారత్ నిర్ణయం – పాక్ కు మరో గట్టి షాక్
