జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఘోర నివేదిక

భారత భద్రతా దళాలు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” ప్రభావం జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు తీవ్రంగా తాకింది. ఈ ఆపరేషన్‌లో తన కుటుంబానికి చెందిన పదిమంది, ఇంకా నలుగురు అనుచరులు ప్రాణాలు కోల్పోయారని ఆ సంస్థ అధినేత మసూద్ అజార్ స్పష్టం చేశాడు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ ఒక కథనంలో ఈ వివరాలను వెల్లడించింది.

పాకిస్థాన్‌లోని బహావల్పూర్ ప్రాంతంలో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కేంద్రం – జామియా మసీద్ సుభాన్ అల్లాపై జరిగిన భారత దళాల బాంబుదాడిలో ఈ మరణాలు జరిగాయని మసూద్ అజార్ పేర్కొన్నాడు. ఈ దాడిలో తన పెద్ద సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, ఇంకా ఐదుగురు పిల్లలు మరణించారని ఆయన ప్రకటించాడు.

1994లో భారత్‌లో అరెస్టై, అనంతరం ఐసీ 814 విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు వల్ల విడుదలైన మసూద్ అజార్, ఈ ఘటనపై స్పందిస్తూ – “నా కుటుంబానికి చెందిన పది మంది ఈ సంతోషకరమైన స్థితిని పొందారు. వారిలో అమాయక పిల్లలు, పెద్ద సోదరి, మేనల్లుడు, మేనకోడలు ఉన్నారు. వారి నిష్క్రమణ పట్ల నాకు విచారం లేదు. నేను కూడా వారితో ఉండే భాగ్యం కలిగితే బాగుండేది,” అంటూ స్పందించాడు.

అంతేకాకుండా, ఈ దాడిలో మరణించినవారు ‘అల్లా దర్బార్‌కు అతిథులుగా’ వెళ్లారని, వారి అంత్యక్రియల ప్రార్థనలకు హాజరయ్యేందుకు ప్రజలను ఆహ్వానించినట్లు పీటీఐ నివేదిక పేర్కొంది.

Read More : మసూద్ అజార్ కుటుంబ సభ్యుల మృతి…