భారత్ మరియు పాకిస్థాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలు మరియు ఘర్షణ వాతావరణం శాంతి వైపు వెళ్లడానికి, భారతదేశం తన దూకుడు వైఖరిని మార్చి వెనక్కి తగ్గాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ, “భారతదేశం నుంచి ఎలాంటి దురాక్రమణ జరగితే, దానికి తగిన ప్రతిస్పందన ఇచ్చే హక్కు పాకిస్థాన్‌కు ఉందని” చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఘర్షణలో, తమ దాడులకు మాత్రమే ప్రతిస్పందించాల్సి వచ్చిందని పేర్కొనగా, “ఇస్లామాబాద్‌ను దురాక్రమణ దారులుగా చూపించవద్దు” అని ఆయన నొక్కి చెప్పారు.
“భారతదేశం ఈ ఉద్రిక్తతలను ప్రారంభించింది. ఒకవేళ వారు వెనక్కి తగ్గాలని సిద్ధపడితే, మేము ఈ పరిస్థితిని శాంతిగా పరిష్కరించగలము” అని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. “మా సరిహద్దులను రక్షించుకోవడానికి మేము తప్పకుండా స్పందిస్తాము, కానీ భారత్ వెనక్కి తగ్గితే, మేము ఈ ఉద్రిక్తతలను ముగిస్తాం” అని ఆయన స్పష్టత ఇచ్చారు.
Read More : పాక్ కుట్ర బహిరంగం

One thought on “భారత్ వెనక్కి తగ్గితే పాకిస్థాన్ ఉద్రిక్తతలను ముగిస్తాం: ఖవాజా ఆసిఫ్”
Comments are closed.