అస్సాంలో వివాదాస్పద నినాదం

అస్సాం రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన విజయ ర్యాలీ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువకుడు భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో ర్యాలీలో ఉన్న ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పాకిస్థాన్ జిందాబాద్… భారత్ ముర్దాబాద్’ అంటూ యువకుడు గట్టిగా నినదించడంతో అక్కడ ఉన్న వారు వెంటనే స్పందించి అతడిని నిలదీశారు. దేశభక్తి భావాలు ఉప్పొంగిన పరిస్థితుల్లో దేశాన్ని దూషించడాన్ని తట్టుకోలేని స్థానికులు, అతడిపై దౌర్జన్యానికి దిగారు. కొందరు అతనిపై ఫిజికల్‌గా ప్రతికార చర్యలకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై పోలీసులు స్పందించి, యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దేశద్రోహ నినాదాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు దేశభద్రతకు ప్రమాదకరమని పేర్కొంటూ ప్రజలకు కూడా పోలీసు అధికారులు శాంతి పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పౌరులు స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునే హక్కు ఉన్నా… దేశ భద్రత, గౌరవానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించడం అసహ్యతకరమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read More : సికింద్రాబాద్ – ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్

One thought on “అస్సాంలో వివాదాస్పద నినాదం

Comments are closed.