ఆన్‌లైన్ బెట్టింగ్ మోజు… మరో యువకుడి ప్రాణం తీసింది.

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం మరో కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వంశీ, కారు మెకానిక్‌గా పని చేస్తూ జీవనం కొనసాగించేవాడు. కానీ గత మూడేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారి, స్నేహితులు, బంధువుల వద్ద నుంచి దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు.

ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు వంశీని మందలించారు. దాంతో మనస్తాపానికి గురైన వంశీ, ఇంటి సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై ఆకర్షితమవుతూ జీవితాలను పాడుచేసుకుంటున్న ఘటనలలో ఇది తాజా ఉదాహరణగా నిలిచింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More : హైదరాబాద్, అన్నమయ్య జిల్లాల్లో ఆత్మహత్యలు

One thought on “ఆన్‌లైన్ బెట్టింగ్ మోజు… మరో యువకుడి ప్రాణం తీసింది.

Comments are closed.