ఓ భామ అయ్యో రామ.. టైటిల్ సాంగ్‌తో మూవీపై హైప్ పెరుగుతోంది!

O Bhama Ayyoh Rama title song

యువ హీరో సుహాస్ నటిస్తున్న తాజా సినిమా ఓ భామ అయ్యో రామ టీజర్‌కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో తాజాగా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. “ఎలాగుండే వాడ్నే ఎలాగా అయిపోయానే…” అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శ్రీహర్ష ఈమని రాసిన సాహిత్యం, శరత్ సంతోష్ ఆలాపన, రథన్ సంగీతం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మెయిన్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ ఈ పాటను మరింత ఆహ్లాదంగా మార్చింది.

ఈ సినిమాతో మలయాళ హీరోయిన్ మాళవిక మనోజ్ తెలుగులో అడుగుపెడుతున్నారు. రామ్ గోదాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హరీష్ నల్ల నిర్మించగా, స్పిరిట్ మీడియా ద్వారా రానా దగ్గుబాటి విడుదల చేయనున్నారు. పాట విడుదల సందర్భంగా నిర్మాత హరీష్ మాట్లాడుతూ, “ఈ పాట యూత్‌ఫుల్ వాతావరణాన్ని తెరపై చూపిస్తుంది. సుహాస్, మాళవికల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సినిమా మొత్తం ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం,” అని అన్నారు.

దర్శకుడు రామ్ గోదాల మాట్లాడుతూ, ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండగా, ఒక్కో పాట ఒక్కో వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు. టైటిల్ సాంగ్ యూత్‌ను వెంటనే ఆకట్టుకునేలా ఉందని చెప్పారు. లిరికల్ వీడియోలోని కలర్‌ఫుల్ ఫ్రేమ్స్, డ్యాన్స్ మూమెంట్స్ పాటకు విశేష ఆదరణను తెచ్చాయి. పాటను చూసినవారంతా ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట యూత్‌లో వేగంగా ట్రెండ్ అవుతుండగా, మేకర్స్ త్వరలోనే ఆడియో ఆల్బమ్‌తో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు.

Read More

One thought on “ఓ భామ అయ్యో రామ.. టైటిల్ సాంగ్‌తో మూవీపై హైప్ పెరుగుతోంది!

Comments are closed.