దివంగత సినీ దురంధరుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల కోసం చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.
వీరిలోను ఇతర ప్రముఖుల రాకను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ముందుగా ఘాట్‌కి వచ్చి నివాళులు అర్పించడం పరంపరగా కొనసాగుతోంది. అనంతరం నందమూరి బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఘాట్‌కి చేరుకుని నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది.
Read More : DCM సూచనలపై నిర్మాత దిల్ రాజు స్పందన

2 thoughts on “NTR ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్”
Comments are closed.