బెట్టింగ్ యాప్ కేసు విచారణకు హాజరైన రానా దగ్గుబాటి

నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఉదయం ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకుని, అధికారులు ప్రస్తుతం ఆయనను ప్రశ్నిస్తున్నారు. యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించి అందుకున్న పారితోషికం, కమీషన్ల వివరాలపై ఈడీ ఆరా తీస్తోంది. ఇక, ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ మొదటిసారి నోటీసులు జారీ చేసినప్పటికీ, ముందుగా నిర్ణయించిన పనుల కారణంగా హాజరుకాలేనని రానా సమయం కోరారు. దీనితో విచారణ తేదీని ఈ రోజుకు మార్చుతూ అధికారులు రెండోసారి సమన్లు పంపారు.

తాజాగా రానా ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశారనే ఆరోపణలపై సెలబ్రిటీలకు నోటీసులు పంపిన ఈడీ, ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండలను విచారించింది. ఇక ఈ నెల 13న నటి మంచు లక్ష్మి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Read More : సినిమాటోగ్రఫీ మంత్రిని కలవనున్న నిర్మాతలు