మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “దేవర 1” సినిమా గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల ఈ సినిమా జపాన్‌లో విడుదలైన సందర్భంగా ఎన్టీఆర్, కొరటాల శివ ప్రమోషన్ల కోసం అక్కడికి వెళ్లారు. మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్, “దేవర 1” కథలో సగం మాత్రమే చూపించామని, “దేవర 2″లో అసలు కథ ఏమిటో తెలియజేస్తామని చెప్పారు.
ఎన్టీఆర్ చెప్పినట్టు, “దేవర 2″కు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయ్యిందని, 2026 మొదటివారంలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిపారు. అందులో ఎన్టీఆర్ తాను ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తారని చెప్పారు. యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుండగా, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నారు. “దేవర 2″కి కూడా అనిరుద్ సంగీతం అందించనున్నారు.
ఇప్పటికే హృతిక్ రోషన్‌తో కలిసి “వార్ 2” పూర్తి చేసిన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై సంక్రాంతి 2026కి విడుదల చేయాలని ప్రణాళిక ఉంది. నవంబర్ ముగిసేలోగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, ఆ వెంటనే “దేవర 2” సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ఎన్టీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

One thought on “దేవర 2పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు – భారీ అంచనాలు”
Comments are closed.