నిహారిక కొత్త ప్రయోగం: మ్యాడ్ బాయ్ కాంబోతో న్యూ మూవీ

Niharika Konidela Mad Boy Movie

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిరంతరం కొత్తవారితో ప్రయోగాలు చేస్తూ మంచి ఫలితాలు అందుకుంటున్న నిహారిక కొణిదెల, ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. గతంలో ముద్దపప్పు అవకాయ, హలో వరల్డ్, బెంచ్ లైఫ్, నాన్న కూచి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వంటి వెబ్‌సిరీస్‌లతో ఆకట్టుకున్న నిహారిక, 2024లో “కమిటీ కుర్రోలు” సినిమాతో ఫీచర్ ఫిల్మ్‌లలోకి అడుగుపెట్టి నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. ఈ విజయం ఆమెను కొత్త ప్రయోగాల పట్ల మరింత ఉత్సాహంగా మలిచింది.

తాజాగా యువ హీరో సంగీత్ శోభన్‌తో కలిసి “మ్యాడ్ బాయ్” పేరుతో తన కొత్త సినిమాను ప్రకటించారు. యూత్‌లో ట్రెండింగ్ స్టార్‌గా నిలిచిన సంగీత్, మాడ్, మాడ్ స్క్వేర్ వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకున్నాడు. కానీ సోలో హీరోగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అతనికి నిహారిక నిర్మాణంలో ఆ అవకాశమొచ్చింది. ఈ చిత్రానికి మనసా శర్మ దర్శకత్వం వహించనున్నారు. “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” వెబ్‌సిరీస్‌లో రచయితగా పని చేసిన మనసా, ఇప్పుడు దర్శకురాలిగా తొలి అడుగు వేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమెకు మహేష్ ఉప్పల స్క్రీన్‌ప్లే, సంభాషణల సహకారం అందిస్తున్నారు.

మొత్తానికి, నిహారిక మరోసారి కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, ఫన్ అండ్ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో కూడిన కథను తెరపై చూపించనున్నారు. పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read More

One thought on “నిహారిక కొత్త ప్రయోగం: మ్యాడ్ బాయ్ కాంబోతో న్యూ మూవీ

Comments are closed.