కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అజిత్ సినిమా విడుదలవుతున్నాడంటే అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తారు. టాలీవుడ్‌లో కూడా ఆయనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. ఇప్పుడు “గుడ్ బ్యాడ్ అగ్లీ” మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
అయితే, రిలీజ్ తేదీ దగ్గరపడుతున్నా సినిమా ప్రమోషన్స్‌లో పెద్దగా చురుకుదనం కనిపించడం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ సాధారణంగా తమ సినిమాలను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తుంటారు. కానీ ఈ సారి పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. ఫ్యాన్స్ మధ్య కూడా సరైన హైప్ లేకపోవడంతో విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని చూసి, అజిత్ ప్రమోషన్లకు ఆసక్తి చూపించకపోవడం ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అజిత్ కుమార్ స్వభావానికి తగ్గట్టు, ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఈవెంట్లలో పాల్గొనడం సాధారణంగా జరగదు. ప్రస్తుతం మైత్రీ సంస్థ మాత్రం ఆయన రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చి, ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంటే బాగుంటుందని భావిస్తోంది. కానీ, అజిత్ దీనికి సై అంటారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ప్రేక్షకుల్లో బజ్ తగ్గిపోయినట్లు అనిపిస్తోంది. “గుడ్ బ్యాడ్ అగ్లీ” విడుదలయ్యాక, సినిమా ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

One thought on “గుడ్ బ్యాడ్ అగ్లీ: అజిత్ ప్రమోషన్స్ లో నిశ్శబ్దం ఎందుకు?”
Comments are closed.