హారర్ మూవీ లవర్స్ కోసం ఓటీటీ మేకర్స్ వరుసగా థ్రిల్లింగ్ హారర్ సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ జానర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సస్పెన్స్, మిస్టరీ, ఊహించని ట్విస్టులతో సాగే చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలో బాక్సాఫీస్ దగ్గర హారర్ మూవీస్ హిట్ అవుతుండటంతో, ఓటీటీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి.
ప్రస్తుతం ఓటీటీలో అనేక హారర్ సినిమాలు సందడి చేస్తున్నాయి. థియేటర్స్‌లో కొత్త సినిమాలు రిలీజవుతుండగా, ప్రతి శుక్రవారం ఓటీటీలో పదుల సంఖ్యలో చిత్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ట్రెండింగ్ కేటగిరీలో హారర్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. భయపడుతూనే థ్రిల్ అనుభూతిని ఆస్వాదించే ప్రేక్షకులు, ఇలాంటి సినిమాలకు విపరీతమైన ఆదరణ చూపిస్తున్నారు.
ప్రస్తుతం ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతున్న హారర్ సినిమా “ఏ క్లాసిక్ హారర్ స్టోరీ”. నెట్‌ఫ్లిక్స్‌లో పది భాషల్లో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను భయపెట్టడమే కాదు, ఊహించని మిస్టరీ ట్విస్టులతో విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సినిమా కథలోకి వెళితే…
ఓ నలుగురు ఫ్రెండ్స్ కారులో అడవిలో ప్రయాణం చేస్తుంటారు. దారిలో అనుకోకుండా వారి కారు ఓ చెట్టును ఢీకొట్టడంతో, సమీపంలోని ఓ వుడెన్ హౌస్ కనిపిస్తుంది. అయితే, ఆ ఇంట్లో వారికి భయానక అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ ఉన్న కొన్ని బొమ్మలను గమనిస్తారు, అయితే అవి సాధారణ బొమ్మలు కాదు. ఆ బొమ్మల కళ్లు, చెవి, నోరు కనిపించకపోవడంతోపాటు, వాటి స్థానంలో నిజమైన మనుషుల అవయవాలు అతికించబడి ఉంటాయి!
ఈ దృశ్యాలను చూసిన ఆ ఫ్రెండ్స్ వణికిపోతారు. ఎటుచూసినా అలాంటి భయానక బొమ్మలే కనిపిస్తాయి. అసలు ఆ బొమ్మలు ఎవరు తయారు చేశారు? ఎందుకు? ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎలాంటి మిస్టరీ దాగుంది?
ఈ సినిమాలో అనేక మిస్టరీలు, ఊహించని ట్విస్టులు ఉన్నాయి. ఆ బొమ్మలను కొందరు ముసుగు వ్యక్తులు పూజిస్తుంటారు. అసలు వారెవరు? ఆ బొమ్మల వెనుక భీకర రహస్యాలేమిటి? చివరికి ఆ నలుగురు ఫ్రెండ్స్ అక్కడికి ఎలా వచ్చారు? నిజానికి అది అడవేనా?
ఈ సినిమా టెన్షన్, సస్పెన్స్, భయానకతకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, గ్రిప్పింగ్ నరేషన్ ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి.
ఇంకా చూడలేదా? అయితే ఒంటరిగా చూడకపోవడమే బెటర్!

One thought on “ఓటీటీలో హారర్ థ్రిల్లర్ మిస్టరీ – ఒంటరిగా చూడకపోవడమే మంచిది!”
Comments are closed.