తాను ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడంపై వచ్చిన విమర్శలపై సినీ నటి నిధి అగర్వాల్ స్పందించారు. భీమవరంలో ఒక ప్రైవేట్ ఈవెంట్‌కు వెళ్లేందుకు ఆ స్టోర్ నిర్వాహకులే వాహనం పంపారని, అది ప్రభుత్వ వాహనమని తనకు తెలియదని ఆమె వివరణ ఇచ్చారు.
నిధి అగర్వాల్ ఏమన్నారంటే…
“ప్రభుత్వం నాకోసం ఎలాంటి వాహనం పంపలేదు. భీమవరంలో ఒక స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్లడానికి ఆ ఈవెంట్ నిర్వాహకులే ఈ వాహనాన్ని పంపారు. అది ప్రభుత్వ వాహనమని నాకు తెలియదు” అని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో నిధి అగర్వాల్ ఈ వివరణ ఇచ్చారు.

Read More : ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్
