నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో నానిని మాస్ లుక్‌లో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్లింప్స్ తోనే సినిమా పైన క్రేజ్ మరింత పెరిగింది. నానిని ఇలా మాస్ మాస్‌గా ఎలా చూపించబోతున్నాడో శ్రీకాంత్? అనే చర్చలు ఇండస్ట్రీ అంతటా వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అన్నది సస్పెన్స్ గానే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం, నానికి జోడీగా ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి ఎంపికైనట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ రాసిన పాత్రకు కృతిశెట్టి పర్ఫెక్ట్గా సరిపోతుందని, అందుకే ఆమెను తీసుకున్నారట. ‘ఉప్పెన’తో బిగ్ హిట్ కొట్టిన కృతి, ఆ తర్వాత తన స్థాయికి తగినహిట్ అందుకోలేకపోయింది. కొంతకాలం కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టినా, అక్కడ కూడా పరిస్థితి పెద్దగా మారలేదు.
ఇప్పుడు ప్యారడైజ్ రూపంలో టాలీవుడ్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది కృతి శెట్టి. నాని వంటి బ్యాంకబుల్ హీరో సినిమాతో తిరిగి మెయిన్ స్ట్రీమ్ లోకి రావడం ఆమెకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకంతో ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో కోలీవుడ్‌లో మూడు సినిమాలు ఉండగా, టాలీవుడ్లో ఈ భారీ ప్రాజెక్ట్‌తో మళ్లీ అవకాశాల తలుపులు తెరుచుకునే ఛాన్స్ ఉంది.

One thought on “కృతి శెట్టికి మళ్లీ గోల్డెన్ ఛాన్స్.. నాని సినిమాలో హీరోయిన్గా ఎంపిక!”
Comments are closed.