ఈసీపై రాహుల్ ఆరోపణలకు స్టాలిన్ మద్దతు

న్యూఢిల్లీ: బీజేపీ, ఎన్నికల కమిషన్ (ఈసీ) కలిసి నేరపూరిత మోసాలకు పాల్పడ్డాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మద్దతు పలికారు. ఈసీని బీజేపీ రిగ్గింగ్ యంత్రంగా మార్చిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

స్టాలిన్ ఏమన్నారంటే..

  • “పోలింగ్‌కు సంబంధించి జరుగుతున్న అక్రమాలపై పోరాటంలో కాంగ్రెస్‌తో డీఎంకే కలిసి నడుస్తుంది.”
  • “ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే అపహాస్యంపాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం.”
  • “రాహుల్ చేసిన ఆరోపణలపై తక్షణమే దర్యాప్తు జరపాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

నకిలీ ఓట్లపై రాహుల్ ఆరోపణలు:
ప్రతిపక్షాలు ప్రతి పౌరుడి ఓటు హక్కు కోసం పోరాడుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నియోజకవర్గంలో నిర్వహించిన సర్వేలో లక్ష నకిలీ ఓట్లు బయటపడ్డాయని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని దేశం ముందు ఉంచినా ఈసీ మౌనంగా ఉందని రాహుల్ విమర్శించారు. ఈసీ స్పష్టమైన ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

‘పార్లమెంట్ టు ఈసీ’ ర్యాలీలో ఉద్రిక్తత:
ఈరోజు ఢిల్లీలో విపక్ష పార్టీల ఎంపీలు నిర్వహించిన ‘పార్లమెంట్ టు ఈసీ’ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఎంపీలు బ్యారికేడ్లు ఎక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు.

Read More : పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన తీర్పు