ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌

సినీ నటి నిధి అగర్వాల్ ఇటీవల ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలో పర్యటించిన ఆమె, ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ కనిపించడంతో ప్రజల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ వాహనాలను కేవలం ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు మాత్రమే కేటాయిస్తారు. అయితే, ఒక సినిమా నటికి ప్రభుత్వ వాహనం ఎలా కేటాయించారనే దానిపై ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు.

Read More : బెట్టింగ్ యాప్ కేసు విచారణకు హాజరైన రానా దగ్గుబాటి