నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఖైదీ పరార్

నెల్లూరు సెంట్రల్ జైలులో హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ మంగళవారం సాయంత్రం జైలులోనుండి పారిపోయాడు. నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘం గ్రామానికి చెందిన ఇండ్ల సురేష్ అనే ఖైదీ, జైలులో ఉన్న సమయంలో అప్రమత్తంగా ఉన్న సిబ్బందిని తప్పించుకొని పరారయ్యాడు. పరారైన ఖైదీ కోసం వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించిన వెంకటాచలం పోలీసులు… వివిధ ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నారు. జైలులో ఖైదీ పరారైన ఘటనతో భద్రతా లోపాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read More : సీఎం – ఆర్థిక సహాయం, ప్రాజెక్టులపై చర్చ

One thought on “నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఖైదీ పరార్

Comments are closed.