నందిగామలో వైఎస్సార్ విగ్రహం తొలగింపుపై ఉద్రిక్తత

కృష్ణా జిల్లా నందిగామలోని గాంధీ సెంటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి సమయంలో అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అనుమతులు లేకుండా విగ్రహం పెట్టారని అధికారులు చెబుతున్నా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాత్రిపూట తొలగించడంపై వైఎస్సార్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ తొలగింపు వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో నందిగామలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించారు.

Read More : వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు సీఎం

One thought on “నందిగామలో వైఎస్సార్ విగ్రహం తొలగింపుపై ఉద్రిక్తత

Comments are closed.