మృతులకు రూ. 10 లక్షల పరిహారం

నగరంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఈ ఘటనకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా సూచించారు.

Read More : నందిగామలో వైఎస్సార్ విగ్రహం తొలగింపుపై ఉద్రిక్తత