CBN : వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో చిత్రం ప్రారంభం.

నందమూరి కుటుంబానికి చెందిన తారక రామారావు టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెడుతున్నారు. మాజీ మంత్రి, నటుడు నందమూరి హరికృష్ణ మనవడు, జానకీరాం కుమారుడు అయిన తారక రామారావును ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తూ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన శుభాకాంక్షలు తెలిపారు. “తారక రామారావుకు సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఎన్టీఆర్‌ లాంటి గొప్ప విజయాలను ఆయన కూడా సాధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి, దుగ్గుబాటి పురంధేశ్వరి, గారపాటి లోకేశ్వరి పాల్గొన్నారు. భువనేశ్వరి చిత్ర పూజలో క్లాప్ కొట్టి ప్రారంభించారు. తారక రామారావు మాట్లాడుతూ, “మా ముత్తాత ఎన్టీఆర్, మా తాత హరికృష్ణ, నాన్న జానకీరాం ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉంటాయి. మా కుటుంబ సభ్యులంతా ఈ వేళ ప్రోత్సాహించడానికి రావడం చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రేక్షకుల ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తుంది” అని భావోద్వేగంగా స్పందించారు.

ఈ సినిమా గురించి మొదటి ప్రకటనే పెద్ద అంచనాలు క్రియేట్ చేయగా, వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించడంవల్ల మరింత ఆసక్తి నెలకొంది.

Read More : శ్రీలీలకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు