బాలీవుడ్ అందాల భామ మలైకా అరోరా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల she షేర్ చేసిన ఓ బీచ్ ఫోటో యూత్‌లో వైరల్‌గా మారింది. వెనక వైపు తీసిన ఆ ఫోటోలో మలైకా తన ఫిట్ ఫిజిక్‌తో ఆకట్టుకుంటోంది. స్టైలిష్ బికినీ లుక్‌లో ఆమె బ్లూ సముద్రాన్ని తథేకంగా చూస్తూ, చేతిలో గ్లాస్‌లో పండ్లరసం ఆస్వాదిస్తూ కనిపించడం యూత్‌ను మెస్మరైజ్ చేసింది.
51 ఏళ్ల వయసులో కూడా మలైకా అరోరా తన గ్లామర్‌తో అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది. ఇటీవల అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత, మలైకా తన జీవితాన్ని సంతోషంగా ఎంజాయ్ చేస్తూ బీచ్ హాలిడేలకు ప్రాధాన్యం ఇస్తోంది. మాల్దీవులు, ఫిజీ, గోవా లాంటి ప్రదేశాల్లో ఆమెను తరచూ చూడొచ్చు. తాజాగా షేర్ చేసిన ఈ బీచ్ ఫోటో ఎక్కడ తీశిందనేది స్పష్టంగా తెలియకపోయినా, ఫ్యాషన్ ప్రియులలో మాత్రం ఈ ఫోటో ట్రెండింగ్ అవుతోంది.
మలైకా ప్రస్తుతం డ్యాన్స్ రియాలిటీ షోలతో పాటు, బ్రాండింగ్ విభాగాల్లో బిజీగా ఉంది. ఆమె సంపాదనను వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి లాభాలను సంపాదిస్తోందని సమాచారం. ఇక త్వరలోనే తన కుమారుడు అర్హాన్ ఖాన్‌ను సినీ రంగంలోకి పరిచయం చేయాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది.
మొత్తంగా చెప్పాలంటే, మలైకా గ్లామర్‌కు ఏ వయసూ అడ్డుకాదని మరోసారి నిరూపించింది.
Read More : CBN : వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో చిత్రం ప్రారంభం.
