బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం కోర్టులో హాజరు పరుస్తున్న పోలీసులు…

వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురానికి తరలించి, ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు. 2018లో అనంతపురం త్రీ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన కేసులో అనిల్‌పై సెక్షన్‌లు 419, 186, 506 IPC కింద ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, వాయిదాలకు హాజరుకాని నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

2018లో అనంతపురం రామచంద్రనగర్ చర్చ్‌ వివాదానికి సంబంధించి తాను ఐఏఎస్ అధికారినని భేషజం వేసి అప్పటి సీఐ మురళీకృష్ణను బెదిరించిన అనిల్‌పై కేసు నమోదైంది. రెండు వర్గాల మధ్య కానుకల పంపిణీ విషయంలో ఏర్పడిన ఉద్రిక్తతల్లో ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలని సీఐపై ఒత్తిడి తెచ్చేందుకు ఫోన్లో బెదిరింపులు చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసుకు సంబంధించి కోర్టు వాయిదాలకు అనిల్ హాజరుకాకపోవడంతో, పీటీ వారంట్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అనిల్‌ను అనంతపురం త్రీటౌన్ పోలీసులు గురువారం తెల్లవారుజామున జిల్లాకు తీసుకువచ్చారు. ఇక మరికాసేపట్లో అనిల్‌ను అనంతపురం కోర్టులో హాజరు పరచనున్నారు.

అంతేకాకుండా, ఫోర్‌టౌన్ పోలీసులు మరో కేసులో కోర్టులో పిటిషన్ వేశారు. అనిల్ తల్లి అనారోగ్యానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి మధ్యంతర బెయిల్ తీసుకున్నాడంటూ కోర్టులో ఆరోపించారు. దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది.

Read More : ఏపీ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

One thought on “బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం కోర్టులో హాజరు పరుస్తున్న పోలీసులు…

Comments are closed.