రీసెంట్ టైంలో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్న హాలీవుడ్ సినిమా ‘ఎఫ్ 1’. రేసింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో బ్రాడ్ పిట్ హీరోగా నటించాడు. రేసింగ్ తరహా మూవీని ఇష్టపడే వాళ్లకు ఇది చాలా పిచ్చిగా నచ్చేస్తోంది. అంతెందుకు ప్రభాస్-ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాని థియేటర్లో చూస్తున్నప్పుడు నెటిజన్ల కంటికి చిక్కారు. తాజాగా, ఈ మూవీ గురించి టాలీవుడ్ నిర్మాత నాగవంశీ స్పందించారు. కాకపోతే మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. విజయ్ దేవరకొండతో కింగ్ డమ్ నిర్మించిన వంశీ .. జూలై 31న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ‘ఎఫ్ 1’ గురించి ప్రస్తావిస్తూ.. ఇది తనకు ‘జెర్సీ’ మూవీలా అనిపించిందని చెప్పుకొచ్చారు.
ఈ కంపేరిజన్ చెప్తే ఆడియెన్స్ నన్ను తంతారేమో, కాంట్రవర్సీ కూడా అవుద్ది. ఎఫ్ 1 సినిమా నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది కానీ ఎండ్ పొజిషన్ చూస్తుంటే ‘జెర్సీ’ గుర్చొచ్చింది. రేస్ కు వెళ్తాడా లేదా మెడికల్ కండీషన్ కానీ ఈ సీన్స్ చూసినప్పుడు జెర్సీ చూసినట్లు అనిపించింది అని నాగవంశీ చెప్పారు.
నాని హీరోగా నటించిన ఈ క్రికెట్ డ్రామా సినిమాని నాగవంశీనే నిర్మించారు. ఆ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరి.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో కింగ్ డమ్ తీశాడు. దీనిపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండకు గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. అందుకే ఈ మూవీపై విజయ్ తో పాటు ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. మరి వారి ఆశలు, అంచనాలు తీరుతాయో లేదో చూడాలంటే ఈ నెల 31 వరకు ఆగాల్సిందే.
Read More : సిద్ధార్థ్ – కియారా దంపతులకు ఆడబిడ్డ జననం

One thought on “ఈ కంపేరిజన్ చెప్తే ఆడియెన్స్ నన్ను తంతారేమో.. నాగవంశీ”
Comments are closed.