రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ టోల్ ప్లాజాలో ప్రభుత్వ ఉద్యోగి అనే సాకుతో టోల్ చెల్లించేందుకు నిరాకరించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. రంగారెడ్డి కలెక్టరేట్‌లో సర్వే & రికార్డ్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సిద్ధిఖీ అనే వ్యక్తి, టోల్ చెల్లించాల్సిందిగా కోరిన సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
టోల్ రుసుము చెల్లించకుండా ముందుకు వెళ్లాలంటూ ప్రయత్నించిన సిద్ధిఖీ వాహనాన్ని సిబ్బంది ఆపడంతో, ఆయన వాహనం నుంచి దిగిపోయి టోల్ సిబ్బందిని దుర్భాషలాడి దాడికి దిగాడు. ఈ ఘటనలో సిద్ధిఖీతో పాటు అతని బంధువు కూడా టోల్ సిబ్బందిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.
సిబ్బంది స్పందించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగి హోదాలో టోల్ చెల్లించకుండా ప్రవర్తించిన సిద్ధిఖీ చర్యలపై అధికార వర్గాలు స్పందించాల్సి ఉంది.
Read More : నాగర్‌కర్నూల్‌లో ఘోర హత్య…

2 thoughts on “రంగారెడ్డి టోల్ గేట్ వద్ద ప్రభుత్వ ఉద్యోగి దౌర్జన్యం — టోల్ సిబ్బందిపై దాడి”
Comments are closed.