పాకిస్థాన్‌తో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య, దేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు క్రికెట్ స్టేడియాలు, విమానాలు, విమానాశ్రయాలకు ఈ విధమైన బెదిరింపులు వచ్చాయని తెలిసింది. అయితే, అవన్నీ బూటకమని అధికారులు తేల్చారు. ఇప్పుడు ముంబయి పోలీసులకూ తాజాగా బాంబు బెదిరింపు మెయిల్ అందింది.
ముంబయి నగరంలో రెండు రోజుల్లో భారీ పేలుళ్లు జరగనున్నాయని బెదిరింపు మెయిల్లో పేర్కొన్నది. ఈ మెయిల్ మంగళవారం ఉదయం ముంబయి పోలీసు కంట్రోల్ రూమ్‌కు చేరింది. బెదిరింపులను తేలికగా తీసుకోకూడదని, అప్రమత్తంగా ఉండాలని మెయిల్లో హెచ్చరించారు.
ఈ మెయిల్‌ను ఎవరు పంపించారనేది తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకునేందుకు ఐపీ అడ్రెస్ ఆధారంగా పోలీసులు సాంకేతిక దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా చర్యలు కూడా పెంచడం జరిగింది.
READ MORE : పాక్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేయలేదని భారత్ స్పష్టం..

2 thoughts on “ముంబయిలో బాంబు బెదిరింపు: పోలీసుల దర్యాప్తు.”
Comments are closed.