ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు…

చండీగఢ్ నుండి ముంబైకి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ముంబై విమానాశ్రయాన్ని బెదిరించారు. దీంతో, సదరు విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా భద్రతా నిబంధనల మధ్య సురక్షితంగా ల్యాండ్ చేయించారు.

విమానం ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. పూర్తి తనిఖీలు జరుపుతున్న బాంబ్ డిస్పోజల్ టీమ్ ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టంగా అమలు చేశారు.

ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతంలోని పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జమ్ము, శ్రీనగర్, లేహ్, ధర్మశాల, అమృత్‌సర్ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీటి సేవలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Read More : పూంచ్ సెక్టార్‌లో పాకిస్థాన్ కాల్పులు

One thought on “ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు…

Comments are closed.