మూసీ ప్రాజెక్ట్‌కి భారీ వరద నీరు

తెలంగాణలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్‌లో భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం పెరగడంతో అధికారులు ఎలాంటి ప్రమాద పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌కి చెందిన 3వ, 7వ గేట్లను ఎత్తి దిగువకు సెకనుకు 1,293 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

అధికారులు స్థానికులకు హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రాజెక్ట్ పరిసర గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో మూసీ ప్రాజెక్ట్‌కి మరిన్ని వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

Read More : IAS officer : ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు