పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మొహాలీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫేజ్-9లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్‌లో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య బృందాలు, జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను వేగవంతంగా కొనసాగిస్తున్నాయి. ప్లాంట్ పరిసర ప్రాంతంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Read More : ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం : Update

One thought on “మొహాలీలో ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు”
Comments are closed.