బ్రిక్స్ సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు

రియో డి జనీరో (బ్రెజిల్):
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. శాంతి, భద్రతల అంశాలపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మోదీ కీలకంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత ఆత్మ, గౌరవం, గుర్తింపు మీద జరిగిన ప్రత్యక్ష దాడిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని, అంతర్జాతీయ మద్దతుతో పోరాటాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

పహల్గామ్ ఘటనపై బ్రిక్స్ దేశాలు ఒక్కసారిగా స్పందించాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించాయి. ఉగ్రవాదానికి ఎటువంటి మన్నించలేని ధోరణి ఉండాలని, శాంతి స్థాపన కోసం ప్రపంచ దేశాలు ఐక్యంగా పనిచేయాలని బ్రిక్స్ నాయకులు అభిప్రాయపడ్డారు.

Read More : August 1 : అధిక సుంకాల అమలుపై అమెరికా గడువు